యాదాద్రి భువనగిరి : యాదగిరిగుట్ట(Yadagirigutta) లక్ష్మీనరసింహ స్వామి(Lakshminarasimha Swamy) దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు( Brahmotsavam) నాలుగో రోజుకు చేరుకున్నాయి. గురువారం
ఉదయం వట పత్రశాయి అలంకార సేవలో లక్ష్మీనరసింహ స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 7.00 గంటలకు హంస వాహన అలంకార సేవ కొనసాగనున్నది. కాగా, ఆలయ మహా ఉద్ఘాటన తర్వాత రెండోసారి బ్రహోత్సవాలు జరుగుతుండగా, ఈ నెల 21 వేడుకలు కొనసాగనున్నాయి.