సైబర్ మోసాల్లో తొలి గంట కీలకం!
- ఆలోపు ఫిర్యాదు చేస్తే రికవరీకి 80% చాన్స్
- ఆసల్యమైనకొద్దీ ఆశలు వదులుకోవాల్సిందే
- ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నంబర్ 1930
- 14.96 కోట్లు కాపాడిన తెలంగాణ పోలీసులు
హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు కాజేసిన సొమ్మును రికవరీ చేయడంలో తొలి గంట (గోల్డెన్ అవర్) కీలకపాత్ర పోషిస్తున్నది. బాధితులు గంట లోపే ఫిర్యాదు చేస్తే.. పోయిన సొమ్మును రాబట్టడానికి 80 శాతం అవకాశం ఉంటుందని సైబర్‌క్రైం పోలీసులు చెప్తున్నారు. జాతీయ గణాంకాలు కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. సైబర్ నేరం జరిగిన మొదటి గంటలోనే సైబర్‌క్రైం రిపోర్టింగ్ పోర్టల్‌లో లేదా 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇచ్చిన కేసుల్లో 70 నుంచి 80% కేసుల్లో పోలీసులు డబ్బులు తిరిగి రికవరీ చేయగలిగారు.
నేరం జరిగిన రెండు గంటల తర్వాత అందిన ఫిర్యాదుల్లో 15-20% కేసుల్లో మాత్రమే డబ్బు రికవరీ అయ్యింది. ఫిర్యాదులు ఎక్కడ చేయాలి? ఎలా చేయాలి? అనే అంశంపై అవగాహన లేకపోవడంతో చాలామంది బాధితులు ఫిర్యాదు చేయడంలో జాప్యం జరుగుతున్నది. తమ బ్యాంకు ఖాతాలోని డబ్బులు కట్ అయినట్టు మెసేజ్ రాగానే బాధితులు స్థానిక పోలీసు స్టేషన్లకు, బ్యాంకు బ్రాంచీలకు వెళ్తున్నారు.
అక్కడికి వెళ్లిన తరువాత అసలు విషయం తెలుసుకొని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసేలోగా గోల్డెన్ అవర్ దాటి పోతున్నది. మరికొందరు కస్టమర్ కేర్ నంబర్ల కోసం గూగుల్‌లో సెర్చ్ చేసి, మరోసారి సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు. కాబట్టి సైబర్ నేరం జరిగిన వెంటనే జాతీయ స్థాయిలో 24 గంటలూ అందుబాటులో ఉండే టోల్‌ఫ్రీ నంబర్ 1930లో ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.
1930 నంబర్‌కే ఎందుకు ఫిర్యాదు చేయాలి..?
టోల్‌ఫ్రీ నంబర్ 1930కి ఫోన్ చేస్తే టీ4సీ (తెలంగాణ సైబర్‌క్రైం కో-ఆర్డినేషన్ సెంటర్)సిబ్బంది స్పందిస్తారు. బాధితులు మోసపోయిన తీరు, బ్యాంకు ఖాతా వివరాలు వంటి ప్రాథమిక సమాచారం తెలుసుకొని, సైబర్‌క్రైం పోలీసుల అంతర్గత సైట్ ద్వారా ఆయా బ్యాంకులకు సమాచారాన్ని చేరవేస్తారు. దేశంలోని అన్ని బ్యాంకుల ప్రతినిధులు దీనికి అనుసంధానమై ఉంటారు. కాబట్టి అక్కడి ప్రతినిధులు వెంటనే ఆ డబ్బులు ఏ బ్యాంకు ఖాతాకు చేరాయో గుర్తించి వాటిని ఫ్రాడ్ ట్రాన్సాక్షన్‌గా గుర్తించి, డబ్బును ఫ్రీజ్ చేస్తారు. ఇలా మన సొమ్ము మనకు తిరిగి ఇప్పించే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియలో జాప్యం జరిగితే సైబర్ నేరగాళ్లు మన ఖాతా నుంచి కొట్టేసిన నగదును ఇతర ఖాతాల్లోకి మళ్లించి, వాటిని ఏదో ఒక అజ్ఞాత ప్రాంతం నుంచి డ్రా చేసుకునే ప్రమాదం ఉంటుంది. అప్పుడు డబ్బు రికవరీ కష్టమవుతుంది.
తెలంగాణలో రికవరీ ఇలా..
- 2021 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు వచ్చిన కాల్స్ 1,23,160
- మన రాష్ట్రం నుంచి సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టింది రూ.251 కోట్లు
- సైబర్‌క్రైం పోలీసులు కాపాడింది రూ.14.96కోట్లు
- సైబర్ నేరం జరిగిన వెంటనే ఇక్కడ ఫిర్యాదు ఇవ్వండి
- టోల్‌ఫ్రీ నంబర్ 1930
- వెబ్సైట్ అడ్రస్ https://cybercrime.gov.in
- కస్టమర్ కేర్ నంబర్ల కోసం గూగుల్ సెర్చ్‌లు వద్దు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

