Coca cola Plant | హైదరాబాద్, డిసెంబర్ 1(నమస్తే తెలంగాణ) : తెలంగాణ సమగ్రాభివృద్ధికి తొలి సీఎం కేసీఆర్ దార్శనికతతో ప్రణాళికలు రచించారు. ఇందులో భాగంగా పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు. చాలా పరిశ్రమలు కార్యరూపం దాల్చగా కొన్ని ఇప్పటికీ అందుబాటులోకి వస్తున్నాయి. బీఆర్ఎస్ సర్కారు తీసుకొచ్చిన పెట్టుబడులు క్రమక్రమంగా ఫలితాలిస్తున్నా యి. సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్‌లో 49 ఎకరాల్లో రూ.1000కోట్ల తో కోకాకోలా గ్రీన్‌ఫీల్డ్ ప్లాంట్ ఏర్పాటుకు 2022 ఏప్రిల్‌లో ఆనాటి ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో ఒప్పందం కుదిరిం ది.
అమీన్‌పూర్‌లోని కోకాకోలా ప్లాంట్‌ను రూ.142కోట్లతో విస్తరించింది. రెండో ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. బండ తిమ్మాపూర్‌లో భారీ బాట్లింగ్ యూనిట్ నిర్మించింది. ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో పనిచేసే నాటికి 400 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఈ ప్లాంట్‌ను నేడు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించనున్నారు.