రాజన్న సిరిసిల్ల : బావిలో పడిన మహిళను(Woman) ఫైర్ సిబ్బంది కాపాడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వేములవాడ(Vemulavada) పట్టణానికి చెందిన కూర రాజమణి(45) అనే మహిళ బద్దిపోచమ్మ వీధిలో ప్రమాదవశాత్తు బావిలో(well) జారి పడింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది(Fire crew) సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకొని మహిళను బయటకి తీశారు. ఈ ప్రమాదంలో బావిలో పడిన రాజమణికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను పోలీసులు 108 వాహనంలో ఏరియా హాస్పిటల్కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బావిలో పడిన మహిళను కాపాడిన ఫైర్ సిబ్బంది
సిరిసిల్ల – వేములవాడ పట్టణంలో రాజమణి(45) అనే మహిళ ప్రమాదవశాత్తు బావిలో జారి పడింది.. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మహిళను బయటకి తీశారు. pic.twitter.com/9LnaByKD95
— Telugu Scribe (@TeluguScribe) June 9, 2024