హైదరాబాద్ : రాష్ట్రంలో మూడో విడత పంచాయతీ పోలింగ్ చెదురు ముదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. మూడో విడుతలో 4,159 సర్పంచ్ స్థానాలకు(Sarpanch elections) ఎన్నికలు నిర్వహించారు. ఈ మేరకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. గ్రామాల్లో ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను రానుపోను కిరాయి డబ్బులు ఇచ్చి రప్పించారు.
ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు క్యూలో నిల్చున్న వారికి ఓటేసేందుకు అవకాశం కల్పించారు. కాగా, మొదటి, రెండో విడతల ఎన్నికల మాదిరిగానే మూడో విడత తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ గట్టి పోటీనిస్తోంది. మరి కాసేపట్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.