గోపాల్పేట, మార్చి 30 : కొడుకు మరణాన్ని తట్టుకోలేక మనస్తాపంతో తండ్రి మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం బుద్ధారంలో ఆదివారం చోటుచేసుకున్నది. గ్రామస్థుల కథనం మేరకు.. బుద్ధారం గ్రామానికి చెందిన ఏశమోని ఆంజనేయులు (30) ఈనెల 20న ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మరణాన్ని తట్టుకోలేక కొద్దిరోజులుగా మనస్తాపానికి గురైన ఏశమోని కోదండం (60) ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. కొద్దిరోజుల వ్యవధిలోనే ఒకే ఇంట్లో తండ్రీకొడుకు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.