Voter Card | హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గతంలో జారీ చేసిన ఓటరు కార్డులకు కొత్త నంబర్లను కేటాయిస్తూ ఓటర్లకు ఎన్నికల సంఘం లేఖ రాసింది. రాష్ట్రంలో దశాబ్దం క్రితం వరకు జారీ చేసిన ఓటరు కార్డులు 47 లక్షల వరకు ఉన్నాయని గుర్తించారు.
దేశవ్యాప్తంగా ఓటరు కార్డు నంబర్లు ఒకే రీతిలో ఉండేలా మార్పులు చేశారు. రాష్ట్రంలో 14 నంబర్లతో కార్డులు జారీ అయ్యాయి. మొదట AP అనే ఇంగ్లిష్ నంబర్ ఉంటుంది. 12 డిజిటల్ నంబర్లు ఉంటాయి. వీటి స్థానంలో కొత్తగా మొదటి మూడు ఇంగ్లిష్ అక్షరాలు 7 అంకెలతో నంబర్ కేటాయించారు. పాత కార్డు నెంబర్‌తో ఓటు వెతికితే వివరాలు లభ్యం కావు. ఈ నేపథ్యంలో ఓటర్లు గందరగోళానికి గురి కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఓటర్లకు ఈసీ లేఖలు రాసింది. ఓటరు పూర్తి వివరాలు పాత కార్డు నంబర్‌తోపాటు కొత్త ఓటరు కార్డు నంబర్‌ను లేఖలో పేర్కొన్నారు.