హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ) : లోక్సభ ఎన్నికల విధుల్లో మరణించిన 13 మంది ఉద్యోగుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను ఎన్నికల సంఘం విడుదల చేసింది.
ఈ మేరకు మొత్తం రూ.195 లక్షలను విడుదల చేస్తూ సీఈవో వికాస్ రాజ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.