హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ సాయుధ రైతాంగ పో రాట తొలి అమరుడు కామ్రేడ్ దొడ్డి కొమురయ్య ఆశయ సాధనకు ప్రతి ఒకరూ కృషి చేయాలని వక్తలు కొనియాడారు. కొమురయ్య 80వ వర్ధంతి సందర్భంగా హై దరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్లో శనివారం సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ స త్యం కొమురయ్య చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడవెండి గ్రామంలో నిర్వహించిన ర్యాలీపై రజాకార్లు, దేశ్‌ముఖ్ ప్రైవేట్ సైన్యం కాల్పులు జరపడంతో 1946 జూలై 4న దొడ్డి కొమురయ్య అమరుడైనట్టు తెలిపారు. కొమురయ్య అమరుడైనతర్వాతే హైదరాబాద్ సంస్థానవ్యాప్తంగా భూస్వామ్య వ్యవస్థకు, నిజామ్‌లకు వ్యతిరేకంగా ప్రజలు ఉవ్వెత్తున ఎగసిపడ్డారని తెలిపారు.