Lingala Ganapuram | భార్యాభర్తలను విడదీసిన అధికారులు..! ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు
లింగాల గణపురం మండలంలో పలు వార్డుల్లో( Wards division) అధికారులు గజిబిజిగా ఓటర్లను చేర్చడం గందరగోళంగా మారింది.
లింగాల గణపురం : జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలో పలు వార్డుల్లో( Wards division) అధికారులు గజిబిజిగా ఓటర్లను చేర్చడం గందరగోళంగా మారింది. అధికారులు ఏ ఇంటి నుంచి మొదలు పెట్టి ఏ ఇంట్లో ముగించారో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఆయా వార్డుల్లో పోటీ చేసే వార్డు సభ్యులు ఓటర్లను మిగతా వార్డుల్లోకి వెళ్లి వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. లింగాల గణపురంలో 11వ వార్డులో కడకంచి నరసింహులు పేరు నమోదు కాగా అతని భార్య కడకంచి లక్ష్మి పేరు 9వ వార్డులో నమోదు చేశారు.
ఒకే ఇంట్లో ఉంటున్న భార్యాభర్తలను రెండు వార్డుల్లో చేర్చడంతో ఆ కుటుంబం అధికారులపై అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. అలాగే ఓకే వీధిలో పక్క పక్కనే ఉన్న మూడు ఇండ్లను అధికారులు మూడు వార్డుల్లో చేర్చి చేతులు దులుపుకున్నారు. మండలం మొత్తం ఇదే పరిస్థితి నెలకొంది. గ్రామ సర్పంచ్ పదవికి ఓటు వేసే సమయంలో గ్రామ మొత్తాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. వార్డు విషయానికి వచ్చేసరికి ఆయా వార్డుల్లోని ఓటర్లు మాత్రమే ఆయా వార్డు సభ్యుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. దీంతో ఆయా వార్డుల్లో పోటీ చేసే వార్డు సభ్యులు తమ ఓటర్లను ఇతర వార్డుల్లో వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

