హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): పిల్లల్లో నులి పురుగుల నివారణకు సోమవారం ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నట్టు వైద్యారోగ్యశాఖ అధికారులు ఆదివారం తెలిపారు.
రాష్ట్రంలో 1 నుంచి 19ఏండ్ల వయసున్న 96,81,855 మంది పిల్లలు, విద్యార్థులకు ఈ మాత్రలు వేయనున్నారు. రాజ్‌భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంత్రి దామోదర రాజనర్సింహ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.