Desk Journalists | అక్రెడిటేషన్ల జారీలో డెస్క్ జర్నలిస్టులకు అన్యాయం.. ఐ అండ్ పీఆర్ కమిషనర్ కార్యాలయం ఎదుట డీజేఎస్ ధర్నా
Desk Journalists | రాష్ట్రంలో చేపట్టిన అక్రెడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియలో డెస్క్ జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలని డెస్క్ జర్నలిస్టుల సంఘం(డీజేఎస్) డిమాండ్ చేసింది. ఈ మేరకు హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని ఐ అండ్ ఆఫీస్ ఎదుట డెస్ సోమవారం భారీ ధర్నా నిర్వహించారు.
- అసంబద్ధ కారణాలతో కార్డులు నిరాకరించడం సరికాదు
- అర్హులందరికీ ఇవ్వాలి :డీజేఎస్
- ఐ అండ్ పీఆర్ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా
Desk Journalists | రాష్ట్రంలో చేపట్టిన అక్రెడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియలో డెస్క్ జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలని డెస్క్ జర్నలిస్టుల సంఘం(డీజేఎస్) డిమాండ్ చేసింది. ఈ మేరకు హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని ఐ అండ్ ఆఫీస్ ఎదుట డెస్ సోమవారం భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బాదిని ఉపేందర్ మాట్లాడుతూ సీనియారిటీ ఉన్నా అసంబద్ధ కారణాలతో డెస్క్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు నిరాకరించడం సరికాదని మండిపడ్డారు. పదేండ్లకు పైగా అనుభవం ఉన్న డెస్క్ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్లు ఇవ్వాలని కోరారు.
సర్క్యులేషన్‌తో ముడిపెట్టి కార్డులు నిరాకరించడం కారణంగా అర్హులైన వందలాది మంది డెస్క్ జర్నలిస్టులకు అన్యాయం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. కేవలం యాడ్స్‌తో సంబంధం ఉన్న సర్క్యులేషన్‌ను ఇలా కార్డుల జారీల ప్రక్రియలో సాకుగా చూపడం ఏంటని మండిపడ్డారు. డెస్క్ జర్నలిస్టులకు గతంలో ఉన్న కార్డులకు పెద్ద సంఖ్యలో కోత పెట్టి ఇబ్బందులకు గురి చేయడం భావ్యం కాదని పేర్కొన్నారు. మహిళా జర్నలిస్టులు లేనిచోట, ఆ కోటా కార్డులు అదే సంస్థలో పనిచేస్తున్న ఇతర జర్నలిస్టులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
యాజమాన్య కోటాతో సంబంధం లేకుండా దివ్యాంగులైన వరింగ్ కార్డులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మెజారిటీ జిల్లాల్లో డెస్క్ జర్నలిస్టులకు ఇప్పటివరకు కార్డులు అందలేదని తెలిపారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఐ అండ్ అడిషనల్ జగన్‌కు అందజేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ డెస్క్ జర్నలిస్టుల సమస్యలను కమిషనర్ తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ధర్నాలో డీజేఎస్ కార్యదర్శి కేఎన్ ట్రెజరర్ వీ వెంకటరమణ, జాయింట్ కనపర్తి రమేశ్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు పీ పద్మ, సంఘం ప్రతినిధులు సిలివేరు వెంకటేశ్, చల్లా సైదిరెడ్డి, రాచపల్లి రమేశ్ అశోక్ రమేశ్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
ఉద్దేశపూర్వకంగానే కార్డుల జారీలో జాప్యం: డెస్క్ జర్నలిస్టులు
మరోవైపు ఉద్దేశపూర్వకంగానే కార్డుల జారీలో జాప్యం చేస్తున్నారని డెస్క్ జర్నలిస్టులు మండిపడుతున్నారు. పలు పత్రికలకు ఇష్టారాజ్యంగా కార్డులు ఇస్తున్న అధికారులు మరికొన్నింటికి సర్క్యులేషన్‌ను సాకుగా చూపి నిలిపివేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు జిల్లాల్లో కమిటీ మీటింగ్‌ల పేరిట కార్డుల జారీ ప్రక్రియను జాప్యం చేస్తున్నారని, పలుమార్లు అధికారులను కలిసినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. స్వయంగా సంబంధిత మంత్రి పొంగులేటిని పలుమార్లు కలిసి విన్నవించినా, మీడియా అకాడమీ, ఐఅండ్ పీఆర్ కమిషనర్ కార్యాలయం సరైన రీతిలో స్పందించడం లేదంటూ డెస్క్ జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

