హైదరాబాద్, డిసెంబర్31 (నమస్తే తెలంగాణ): పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తుల గడువు మార్చి31వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తంగా 10.89 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ కాగా, 7.82లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. కాళోజీ వర్సిటీ, పీజీఈసెట్, లాసెట్ తదితర అడ్మిషన్లకు సంబంధించి ఇంకా వివరాలు రావాల్సి ఉందని తెలిపారు. విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల దరఖాస్తును 31వ తేదీ వరకు పొడిగించినట్టు వెల్లడించారు.