హైదరాబాద్, జనవరి 15 (నమస్తే తెలంగాణ) : నామినేటెడ్ పదవులకు ముహూర్తం ఖరారైంది. ఈ నెలాఖరుకు పదవులు భర్తీ చేయనున్నట్టు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. ఈ నెలాఖరులోపు పీసీసీ కార్యవర్గ ఏర్పాటు కూడా పూర్తి చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో కాంగ్రెస్ రాష్ట్ర నేతలు గంటన్నర పాటు భేటీ అయ్యారు. కాంగ్రెస్ పాలన, హమీల అమలుపై సమీక్షించారని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు కోసం పని చేయాలని దిశానిర్దేశం చేశారని తెలిపారు.
హైదరాబాద్, జనవరి 15(నమస్తే తెలంగాణ): పరిశ్రమలు, వాణిజ్య శాఖలోని పలువురు అధికారులను అప్పిలేట్ అథారిటీ, పబ్లిక్ ఇన్ఫర్మేషన్, అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లుగా నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. సమాచార హక్కు చట్టం అమల్లో భాగంగా పరిశ్రమల శాఖ ఉప కార్యదర్శి ఏవీఎన్ రమేశ్ కుమార్‌ను అప్పిలేట్ అథారిటీగా, సహాయ కార్యదర్శులు ఎం సత్యనారాయణ, బీజీ సుమతిని సహాయ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులుగా నియమించారు.
హైదరాబాద్, జనవరి 15 (నమస్తే తెలంగాణ): పరిశ్రమల భద్రతలో సవాళ్లను అధిగమించేందుకు, రక్షణ అంశా ల్లో ఆధునికతను సంతరించుకునేందుకు సీఐఎస్ఎఫ్ దళాలు నిత్యం సంసిద్ధంగా ఉండాలని సీఐఎస్ఎఫ్ డీజీ రా జ్విందర్సింగ్ భట్టి సూచించారు. హైదరాబాద్‌లోని నిసా క్యాంపస్‌లో శిక్షణ పొందుతున్న 37వ బ్యాచ్ అసిస్టెంట్ కమాండెంట్లు, 20వ బ్యాచ్ కానిస్టేబుళ్ల దీక్షాంత్ పరేడ్ బుధవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రాజ్విందర్సింగ్ హాజరై క్యాడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.