టీఎస్పీఎస్సీ కేసు విచారణ 13కు వాయిదా
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల కేసులో నిందితుల విచారణను అక్టోబర్ 13కు వాయిదా వేస్తూ కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో 37వ నిందితుల వరకు కోర్టుకు హాజరయ్యారు.
నాంపల్లి కోర్టులు, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల కేసులో నిందితుల విచారణను అక్టోబర్ 13కు వాయిదా వేస్తూ కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో 37వ నిందితుల వరకు కోర్టుకు హాజరయ్యారు. 16వ నిందితుడు న్యూజిలాండ్‌లోని ఓ కంపెనీ మేనేజర్‌గా పనిచేస్తున్న సాన ప్రశాంత్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్ కొనసాగుతున్నదని మెజిస్ట్రేట్ సిట్ అధికారులకు తెలిపారు. ఈ విషయంలో అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నిందితుడు ప్రశాంత్ న్యూజిలాండ్‌లో ఉండటంతో ఆయన తరఫున నాంపల్లి నాలుగో ఆదనపు సెషన్స్ కోర్టులో దాఖలైన ముందస్తు బెయిల్‌ను తిరస్కరించారు. మరోవైపు నిందితుడి తరఫున వారెంట్‌ను తొలగించేందుకు రీకాల్ దాఖలు చేసే అవకాశమున్నది. ప్రధాన నిందితుడు పులిదిండి ప్రవీణ్‌కుమార్ తరఫు న్యాయవాది హైకోర్టులో బెయిల్ దాఖలు చేశారు. ఇప్పటివరకు రిమాండ్ ఖైదీగా చంచల్‌గూడ జైలులో ఆయన కొనసాగుతున్నాడు. ఈ కేసులో నలుగురు నిందితుల తరఫున న్యాయవాదులు గైర్హాజరు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో వచ్చేనెల 13న నిందితులకు ఎగ్జామినేషన్ ప్రక్రియ చేపట్టేందుకు 12వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు చర్యలు చేపడుతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
Navaratri Brahmotsavams | వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. సింహ వాహనంపై యోగ నరసింహుని దర్శనం
రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ అత్తి సతీశ్‌కు గాయాలు
Food Poison | నర్సాపూర్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాతే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

