TGPSC | హైదరాబాద్, మార్చి 21 ( నమస్తే తెలంగాణ ) : టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల వివాదం మరింతగా ముదురుతున్నది. ఫలితాలపై రోజుకో రగడ జరుగుతున్నది. టీజీపీఎస్సీ గ్రీవెన్స్ సెల్‌కు వివిధ అంశాలపై అభ్యర్థుల ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలే టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్-1 మెయి న్స్ ఫలితాలను చూసుకున్న పలువురు అభ్యర్థులు నివ్వెరపోవాల్సిన పరిస్థితి. ఆనాటి నుంచే తమకు అన్యాయం జరిగిందని వందలాది మంది అభ్యర్థులు రగిలిపోతున్నారు. ముఖ్యంగా అభ్యర్థుల నుంచి మెయిన్స్ పేపర్ల రీ-వాల్యుయేష న్ డిమాండ్ బలంగా వినిపిస్తున్నది. తెలుగులో రాసిన తమకు తక్కువ మా ర్కులొచ్చాయని, ఇంగ్లిష్ మీడియం అ భ్యర్థులకే ఎక్కువ మార్కులేశారని తెలు గు మీడియా అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు. వివిధ అంశాలపై గ్రీవె న్స్ సెల్‌కు ఫిర్యాదులు అందజేశారు. కొందరు అభ్యర్థులు ఏకంగా గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. శుక్రవారం వరకు 448 టీజీపీఎస్సీకి ఫిర్యాదు చేశారు. కొందరు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎంపీ చామ ల కిరణ్‌కుమార్‌రెడ్డి ద్వారా సీఎం రేవంత్‌ను కలిసేందుకు మరికొందరు ప్రయత్నిస్తున్నారు. అయినా న్యాయం జరగదనే భావనలో ఉన్న వందలాది అభ్యర్థు లు హైకోర్టును ఆశ్రయించేందుకు సమాయత్తం అవుతున్నారు. ఇటీవలే ఇందిరాపార్క్‌లో సమావేశమైన అభ్యర్థులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
పలువురు అభ్యర్థులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆశ్రయించారు. తమకు న్యాయం జరిగేలా చొరవ చూపాలని కోరారు. స్పందించిన కవిత గ్రూప్-1 మెయిన్స్ పేపర్లను రీ వాల్యుయేషన్ చే యాలని ఇటీవల మండలిలో డిమాండ్ చేశారు. గ్రూప్-1 జీఆర్ఎల్ విడుదల చేయకపోవడం, గ్రూప్-1 ప్రిలిమ్స్, మెయిన్స్‌కు వేర్వేరు హాల్‌టికెట్లు విడుదల చేయడం వంటి అంశాలను ఆమె లేవనెత్తారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ల్లో అక్రమాలు జరిగాయని ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ సైతం ఆరోపణలు గుప్పించారు. గ్రూప్-1 పోస్టులను అమ్ముకున్నారని, అక్రమాలు చోటుచేసుకున్నాయని ఏకంగా పోటీ పరీక్షల శిక్షకుడు అశోక్‌కుమార్ ఆరోపించారు. కోర్టు కేసులు ఉండగా, 6 నెలల్లో చేయాల్సిన వాల్యుయేషన్‌ను మూడు నెలల్లో ఎలా ముగించేస్తారంటూ ఆయన ప్రశ్నించారు.