కామారెడ్డి : కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డిలోని ప్రాథమిక పాఠశాలలో కాంట్రాక్టర్ పాండురంగారావు రూ.55 లక్షలు వెచ్చించి అదనపు తరగతి గదులు నిర్మించారు. అప్పు చేసి పనులు పూర్తిచేసినా బిల్లులు రాకపోవడంతో ఆవేదనకు గురైన కాంట్రాక్టర్.. గురువారం గదులకు తాళం వేశారు. దీనిపై డీఈవో రాజును వివరణ కోరగా.. ప్రభుత్వం మారడంతో బిల్లులకు ఆలస్యమైందని, ప్రభుత్వానికి నివేదిక పంపి బిల్లు చెల్లించేలా చూస్తామని తెలిపారు.
ధరూరు : జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు మండలం గుడ్డెందొడ్డి పాఠశాలలోకి గురువారం భారీ మొసలి వచ్చింది. రైతుల ద్వారా సమాచారం అందుకున్న అటవీ అధికారులు అక్కడికి వచ్చి మొసలిని బంధించి జూరాల డ్యాంలో వదిలిపెట్టారు.
మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని బోయినిపేటలో పునుగుపిల్లి సంచరిస్తుంది. బుధవారం రాత్రి మూగ ప్రకాశ్ అనే యువకుడు తాను పెంచుకుంటున్న కోళ్ల బోనులోకి వెళ్లిన ఈ పునుగుపిల్లి కోళ్లను చంపుకొని తిని అందులోనే చిక్కుకు పోయింది. స్థానికుల ఫిర్యాదు మేరకు అటవీ అధికారులు దాన్ని పట్టుకొని అడవిలో సురక్షితంగా వదిలి పెట్టారు.