హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 15,640 అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన ఫర్నిచర్‌ను సమకూర్చే నేపథ్యంలో స్త్రీ, శిశు సంక్షేమశాఖ, సెట్విన్ మధ్య ఒప్పందంపై ఆరోపణల నేపథ్యంలో మొత్తం ప్రక్రియనే రద్దు చేస్తున్నట్టు సంబంధింత విభాగం ప్రకటించింది. రూ. 20 కోట్ల విలువైన ఫర్నిచర్‌ను సమకూర్చాలని స్త్రీ, శిశు సంక్షేమశాఖ సెట్విన్‌ను కోరిం ది. తమకు కావాల్సిన వారు మాత్రమే ఫర్నీచర్‌ను సరఫరా చేసేందుకు అనువుగా సెట్వి న్ వ్యవహరించింది. పత్రికా ప్రకటనకు ఆస్కారం లేకుండా కార్యాలయ నోటీస్‌బోర్డుపై టెండర్ నోటీసును అతికించారు. ఇది నిబంధనలకు విరుద్ధమని తెలంగాణ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ స్టీల్ అండ్ ఉడన్ ఫర్నిచర్స్ తయారీదారుల అసోసియేషన్ తప్పుబట్టిం ది.
అంగన్వాడీ కేంద్రాలకు బుక్ ర్యాక్స్, రౌండ్టేబుల్స్, గ్రీన్చాక్బోర్డ్సు తదితర వస్తువులు సరఫరా చేయాలని స్త్రీ, శిశు సం క్షేమశాఖ సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్‌ను గతనెల 24న కోరింది. ఆ మరునాడే కా ర్యాలయం బోర్డుపై టెండర్ నోటీసును సెట్విన్ విభాగం అంటించింది. మే 25వ తేదీ నుంచి 31వ తేదీ సాయంత్రం 4 గం టలలోపు నిర్దేశిత ఫార్మాట్లో టెండర్లు స మర్పించాలని పేర్కొన్నది. దీనిపై తెలంగా ణ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ తీ వ్ర అభ్యంతరం పెట్టింది. పరిస్థితి తీవ్రతను గ్రహించిన సెట్విన్ ఈ టెండర్ ప్రక్రియను రద్దు చేస్తున్నట్టు ఈనెల 3వ తేదీన అదే నోటీస్‌బోర్డు ద్వారా వెల్లడించింది.