హైదరాబాద్ : దేశంలో మునుపెన్నడూ లేని విధంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్(BR Ambedkar) 125 అడుగుల విగ్రహాన్ని నిర్మించడమే కాకుండా నూతన సచివాలయానికి(New Secretariat) అంబేద్కర్ నామకరణ చేయడం చారిత్రాత్మకమని బీఆర్ఎస్వీ(BRSV) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గదరాజు చందు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR )కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీని ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ సచివాలయం మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు చేరుకున్న తరువాత అంబేద్కర్, కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.ఆయన మాట్లాడుతూ అంబేద్కర్‌ను గౌరవించుకోవడమంటే యావత్ జాతిని గౌరవించుకోవడమని అన్నారు.
భారీ అంబేద్కర్ విగ్రహం ఆయన ఆశయ సాధనకు ప్రతీకగా, భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు వేల్పుకొండ వెంకటేశ్, జంగయ్య, నాగరాజు, జలంధర్‌గౌడ్, రవి, గణేశ్, డాక్టర్ కృష్ణ, ప్రవీణ్‌కుమార్, శ్రీనివాస్‌రెడ్డి, రాజుయాదవ్, నాగేంద్రరావు, అవినాశ్, పాండురంగ, శ్రీనునాయక్, జోసెఫ్, శ్రవణ్, శివ, అన్వేష్, విక్రమ్, పరుశురాం పాల్గొన్నారు.