నిజామాబాద్ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నిజామాబాద్ పట్టణం చంద్రశేఖర్ నగర్ కాలనీకి చెందిన ఓ మైనర్‌ను ఏఆర్ కానిస్టేబుల్ గర్భవతిని చేశాడు. బాలిక కుటుంబంతో ఉన్న పరిచయాన్ని ఆసరాగా చేసుకొని కొంతకాలంగా చనువుగా ఉంటూ శారీరకంగా వాడుకున్నాడు. నిందితుడు ఏఆర్ కానిస్టేబుల్ శ్రీకాంత్‌గా గుర్తించారు.
బాలిక కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొంతకాలంగా బాలిక నివాసానికి శ్రీకాంత్ వచ్చి పోతూ ఉండేవాడని, ఇదే క్రమంలో బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నట్లుగా కుటుంబీకులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.