హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): దేశాన్ని దోచుకున్న పార్టీ కాంగ్రెస్ అని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ విమర్శించారు. ఆ పార్టీ అహంకారాన్ని పదేండ్లపాటు బొందబెట్టి ప్రాంతీయ పార్టీ శక్తి ఏంటో దేశానికి చూపించిన వ్యక్తి కేసీఆర్ అని గుర్తుచేశారు. 2029లో కాంగ్రెస్ అనే అవినీతి పార్టీని మళ్లీ భూస్థాపితం చేసి బీఆర్ఎస్ సత్తాను మరోసారి చాటుతామని హెచ్చరించారు. తెలుగుజాతిని ఢిల్లీ దర్బార్లో బానిసలా చూసిన కాంగ్రెస్ రాజకీయ సంస్కృతిని బొందబెట్టడానికే నాడు దివంగత ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని గుర్తుచేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించి ఎన్టీఆర్ ఆత్మకు నిజమైన ఘన నివాళి అర్పిస్తామని ఆదివారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.