‘సింగరేణి మెడికల్ బోర్డు నిర్వహించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. డిపెండెంట్ ఉద్యోగాలు, మారు పేర్ల సమస్య, లాభాల వాటాల్లో కార్మికులకు అన్యాయం చేస్తున్నారు. సింగరేణి నిధులను దోచుకుంటూ నష్టాల్లో ఉన్నదని చెప్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా హైడ్రా పేరిట ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
తెలంగాణ ప్రజలు, సింగరేణి కార్మికులు కేసీఆర్నే మళ్లీ ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటున్నారు. తెలంగాణలో పోయింది అధికారం మాత్రమే. ప్రజల గుండెల్లో అభిమానం మాత్రం పోలేదు’ అంటూ గోదావరిఖనిలోని టీబీజీకేఎస్ నాయకులు సింగరేణిలో జరుగుతున్న దోపిడీని ప్లకార్డు ద్వారా వివరించారు.