హైదరాబాద్ : రైతాంగాన్ని అన్ని రకాలుగా వంచించిన కాంగ్రెస్ సర్కార్ ( Congress Government ) కు పాలించే అర్హత లేదని బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి ( Niranjan Reddy ) , గంగుల కమలాకర్ ( Gangula Kamalakar) , ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ( Palla Rajeshwar Reddy) పేర్కొన్నారు.
శ నివారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రైతు డిక్లరేషన్ ( Farmers Declaration) ను రాహుల్ గాంధీ జన్మదినం రోజున ఉరి వేశారని ఆరోపించారు.వడ్లు కొనుగోలులో ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని విమర్శించారు.2020 లో బీఆర్ఎస్ గరిష్టంగా 92 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేశామని వెల్లడించారు. యూరియా పై ఆంక్షలు పెట్టడం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు పంట మార్పిడి ఎలా చేస్తారని ప్రశ్నించారు.
యాసింగి ధాన్యానికి ఇంతవరకు బోనస్ ఇవ్వలేదు.ఇప్పుడేమో 7 రకాల వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామంటు న్నారని వివరించారు. ఎక్కువ దిగుబడి వచ్చే సాగుబడిని రాష్ట్ర ప్రభుత్వం సూచించిన కొత్త రకం వడ్లకు ఎకరానికి 10 క్వింటాల్ ధ్యానం తక్కువగా వస్తుందని తెలిపారు. కృష్ణా, గోదావరి జలాల వడిసి పట్టుకోవాలని కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని అనుకున్నారని వెల్లడించారు.పాలమూరు రంగారెడ్డి 95 శాతం పూర్తి అయింది. మరో 5 శాతం పనులు పూర్తి చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు.రాజకీయాల కోసం రైతాంగ ప్రయోజనాలను పక్కన పెట్టడం సరికాదని సూచించారు.
పాలన చేతకాకపోతే దిగిపోవాలి
కేంద్రం ఎంత కొనమంటే అంతే కొంటామని రేవంత్ రెడ్డి అనడం సరికాదని గంగుల కమలాకర్ అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులో భాగంగా రైతు తనకు నచ్చిన పంటను పండిస్తారు. పండించిన పంటను ప్రభుత్వాలు కొనుగోలు చేయాలి.కొనుగోలు చేయడం చేతకాకపోతే అధికారం నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు.
రైతుల పక్షాన పోరాడుతాం
రైతు పండించిన పంటను కొనుగోలు చేసేంత వరకు రైతుల పక్షాన పోరాడుతామని
ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్ కంటే ముందే వ్యవసాయానికి ఏం కావాలో కేసీఆర్ రివ్యూ చేసేవారు.రైతులు ఏ విత్తనాలు వేసుకోవాలి. ఎలా సాగు చేసుకోవాలో అధికారులు రైతులకు వివరించేవారని గుర్తు చేశారు.వడ్లు కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ హయంలో కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చామని వెల్లడించారు.
పెట్టుబడి సాయం ఇచ్చిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని కొనియాడారు. కేసీఆర్ హయంలో 11 విడతలుగా 71 వేల మంది రైతులకు రైతు బంధు వేశారని వివరించారు.నల్ల చట్టాల పై రైతులు ఏ విధంగా పోరాటం చేశారో, తెలంగాణలో రైతులు అంతే పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.