HCU | కొండాపూర్, ఫిబ్రవరి 27: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని పరిపాలన భవనానికి అదనంగా నిర్మిస్తున్న పోర్టికో గురువారం సాయంత్రం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులకు గాయా లు కాగా, వారిని సమీప దవాఖానకు చికిత్స కోసం తరలించారు. గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని పరిపాలన భవనానికి అదనంగా చేపట్టిన ఇటీవల పోర్టికో నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ నిర్మాణ పనుల్లో భాగంగా వేసిన కాంక్రీట్ స్లాబ్ గురువారం రాత్రి ఒక్కసారిగా కుప్పకూలింది.
ఈ ప్రమాదంలో గాయపడిన కార్మికులను వర్సిటీ అధికారులు అంబులెన్సులో సమీప దవాఖానకు తరలించారు. రాత్రి సమయం కాబట్టి నిర్మాణ కార్మికులు ఎక్కువగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటించకుండా పనులు చేపట్టడం వలనే ఈ ప్రమాదం జరిగిందని వర్సిటీ విద్యార్థులు ఆరోపించారు. సదరు కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.