జాతీయ హోదా కలిగిన పోలవరం నిర్మాణం నేటికీ పూర్తికాలేదు. కానీ, నిత్యం కూలుతూ.. కుంగుతూ ఉన్నది. ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ రెండ్రోజుల క్రితమే మూడోసారి 8 అడుగుల లోతుకు కుంగింది. కేంద్ర సంస్థల డిజైన్తో, పర్యవేక్షణలో నిర్మాణం సాగిస్తున్న పోలవరం.. 2022 ఆగస్టులోనూ ఇలాగే కుప్పకూలింది.
మరోసారి డయాఫ్రం వాల్ కొట్టుకుపోయింది. ఇంత జరుగుతున్నా.. నేషనల్డ్యాం సేఫ్టీ అథారిటీ అటువైపు కన్నెత్తి చూడలేదు. నివేదిక ఏదీ ఇవ్వలేదు. సైలెంటుగా రిపేర్లు నడుస్తూనే ఉన్నాయి. అవి కూడా కూలుతునే ఉన్నాయి. పోలవరం కాస్తా.. కూలవరమైనా కేంద్రం పట్టించుకున్నదీ లేదు!