కుత్బుల్లాపూర్, డిసెంబర్ 12 : ఆగి ఉన్న లారీని కారు ఢీకొని ముగ్గురు యువకులు మృతిచెందారు. మరొకరు గాయపడ్డారు. మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం… ఏపీలోని కృష్ణాజిల్లా గంటసాల మండలం అచ్చంపాలెంకు చెందిన గాజుల వెంకటసాయి(25), కలిదిండి మండలం కలెకల్లుకు చెందిన పుప్పాల గణేశ్(25), నరహరిశెట్టి సంజయ్(25), కోరుకల్లుకు చెందిన సలాదిఅశోక్(26) కుత్బుల్లాపూర్‌లోని ఆయా ప్రాంతాల్లో కిరాయికి ఉంటున్నారు. అశోక్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ కాగా, వెంకటసాయి క్యాబ్ డ్రైవర్. గణేశ్, సంజయ్ ఉద్యోగాలు వెతుక్కొంటున్నారు. వీరు అప్పుడప్పుడు లాంగ్‌డ్రైవ్‌కు వెళ్తుంటారు. శనివారం అర్ధరా త్రి మద్యం తాగి బాచుపల్లి నుంచి గండిమైసమ్మ వైపునకు కారులో అతివేగంగా వెళ్లి కోకాకోలా ఫ్యాక్టరీ వద్ద ఆగిఉన్న కంటైనర్‌ను ఢీకొట్టారు. వెంకటసాయి, గణే శ్, సంజయ్ అక్కడికక్కడే మృతిచెందగా.. అశోక్‌కు తీ వ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి మద్యం మత్తు, అతివేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.