మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొనకల్ గ్రామంలో కడెం కాలువ నీరు చివరి ఆయకట్టు వరకూ అందక వరిచేను ఎండిపోయింది. కడెం ప్రాజెక్టు 13 డిస్ట్రిబ్యూటరీ కాలువ నీరు అందుతుందనే ఆశతో రైతులు సాగుచేయగా, కడెం కాలువ నీరుఅందక దాదాపు 20 గుంటల్లో వరి చేను ఎండిపోయింది.
నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం గున్ముక్ల శివారులో రైతు పులిమామిడిపేట తిమ్మయ్య సాగుచేసిన రెండెకరాల్లో వరి ఎండిపోయింది. బోరులో నీటిమట్టం గణనీయంగా తగ్గిపోవడంతో నీళ్లు అందక పంట ఎండుముఖం పట్టింది. చేసేదేమీలేక మంగళవారం పంటను పశువులకు వదిలేశాడు. రెండెకరాల పంట ఎండిపోవడంతో రూ.లక్ష వరకు నష్టపోయినట్టు తిమ్మయ్య వాపోయాడు.
భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండల రైతులు సాగునీరు లేక అల్లాడిపోతున్నారు. ఎదుళ్లవాగులో నీళ్లు ఇంకిపోవడంతో కండ్లముందే ఎండిపోతున్న పంటలను చూసి మండలంలోని తుంగారం, రేపల్లెవాడ, సత్యనారాయణపురం, గానుగపాడు, తిప్పనపల్లి, సీతాయిగూడెం తదితర గ్రామాల రైతులు తల్లడిల్లుతున్నారు. ఎదుళ్లవాగులోని కొద్దిపాటి ఊట నీటిని తోడేందుకే ఓ రైతు ఇలా మోటర్ బిగించాడు.