పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆర్ఎంపీ డాక్టర్(RMP doctor) వైద్యం వికటించి బాలుడు మృతి(Boy died) చెందాడు. ఈ విషాదకర సంఘటన పెద్దపల్లి జిల్లా(Peddapalli Dist) కాల్వ శ్రీరాంపూర్ మండలం జాఫర్‌ఖాన్ పేట గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందన శనిగరం స్వాతిక్ (13) గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో సాత్విక్ తల్లిదండ్రులు స్థానిక ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు.
బాలుడికి వైద్యం చేస్తుండగా ఫిట్స్ రావడంతో కరీంనగర్ హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. కాగా, ఆర్ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యం వల్లే బాలుడు చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. బాలుడి మృతికి కారణమైన వైద్యుడిని శిక్షించి తమకు న్యాయం చేయాలన్నారు. సాత్విక్ మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.