మంత్రి కేటీఆర్ చొరవతో స్వగ్రామానికి మృతదేహం
మంత్రి కేటీఆర్ | సౌదీలో ఆత్మహత్య చేసుకున్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం చీర్లవంచకు చెందిన గంగు కనుకయ్య(40) మృతదేహం మంత్రి కేటీఆర్ చొరవ తీసుకోవడంతో గురువారం స్వగ్రామానికి చేరింది.

రాజన్న సిరిసిల్ల : సౌదీలో ఆత్మహత్య చేసుకున్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం చీర్లవంచకు చెందిన గంగు కనుకయ్య(40) మృతదేహం మంత్రి కేటీఆర్ చొరవ తీసుకోవడంతో గురువారం స్వగ్రామానికి చేరింది. మూడు నెలల క్రితం కనకయ్య సౌదీలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, కరోనా పరిస్థితులు ఉన్నా కనకయ్య మృతదేహం తెప్పించేందుకు మంత్రి కేటీఆర్ అక్కడి ఎంబసీ అధికారులతో మాట్లాడి ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
గురువారం శవపేటిక ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కనకయ్యకు భార్య మంజుల, ఇద్దరు కూతుళ్లు ఆదర్శ, మమతలు ఉన్నారు. కనకయ్య కొన్నేళ్లుగా ఉపాధి కోసం సౌదీ వెళ్తుండగా, రెండేళ్ల క్రితం స్వగ్రామానికి వచ్చి, తిరిగి వెళ్లాడు. నాలుగు నెలల క్రితం పెద్ద కూతురు ఆదర్శ వివాహం జరగగా, ఆర్థిక ఇబ్బందులు పెరగడం, అక్కడ ఉపాధి సరిగా లేకపోడంతో మనోవేదన చెంది ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇవి కూడా చదవండి..
పల్లె ప్రగతిలో అందరు భాగస్వాములు కావాలి
జాతీయ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటాలి
రాగల మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు
టీఆర్ఎస్ను వీడే ప్రసక్తే లేదు : ఎంపీ బీబీ పాటిల్
అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
సింగరేణి నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

