e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, August 2, 2021
Home News పల్లె ప్రగతిలో అందరు భాగస్వాములు కావాలి

పల్లె ప్రగతిలో అందరు భాగస్వాములు కావాలి

పల్లె ప్రగతిలో అందరు భాగస్వాములు కావాలి

ఖమ్మం : పల్లెలు, పట్టణాలు నూటికి నూరుశాతం అభివృద్ధిని సాధించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వామ్యం కావాలని రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ అన్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఎమ్మెల్యేలు, జడ్పీ, మున్సిపల్ చైర్మన్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జడ్పీ సీఈఓలు, అటవీ శాఖ, పంచాయతీ రాజ్, ఎంపీడీఓలు, స్పెషల్ ఆఫీసర్స్, ఇతర అధికారులతో గతంలో చేపట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పురోగతి, మళ్ళీ నిర్వహించనున్న పల్లె, పట్టణ ప్రగతిపై క్షేత్ర స్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ..20వ తేదీ నుంచి జిల్లాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తం గా ఉండాలన్నారు. నేటి నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులు కథనరంగంలోకి దిగాల్సిన ఆవశ్యకత ఉందని మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -

అధికారులు నిర్భీతిగా తమ బాధ్యతలను నిర్వర్తించాలని స్పష్టం చేశారు. మీ పని మీరు సమర్థవంతంగా చేయండి. మీరు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. మీకు ఏ సహాయం కావాలన్నా అందుబాటులో ఉంటానని మంత్రి హామీనిచ్చారు. మంచిగ పనిచేసిన వాళ్లను గుర్తించి అవార్డులు, రివార్డులు అందజేస్తామని, అదే విధంగా పని చేయని వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గత పట్టణ, పల్లె ప్రగతిలో చేపట్టిన పనులలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, నర్సరీ, వైకుంఠధామం, డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసుకున్నామని గుర్తు చేశారు. కాగా, అతి తక్కువ శాతంలో కొన్ని డంపింగ్ యార్డులు, వైకుంఠధామం లు ప్రారంభం కాలేదన్నారు. వాటికి తక్షణమే స్థానిక ప్రజాప్రతినిధులు పునుకొని వాటిని ప్రారంభించి వాడుకలోకి తేవాలన్నారు.

గ్రామంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల పరిశుభ్రత బాధ్యత బాధ్యతను గ్రామ సర్పంచి తీసుకోవాలి. మున్సిపాలిటీల పరిధిలోని ప్రజాసంబంధ సంస్థల పారిశుధ్య బాధ్యతను మున్సిపాలిటీ పాలకవర్గాలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇందుకు గ్రామ కార్యదర్శి బాధ్యత వహించాలన్నారు.

సమీక్షా సమావేశం సందర్భంగా మండల వారీగా ప్రగతి పురోగతిని గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి గొప్పగా పనిచేస్తున్నయని, అయితే ప్రతి సీజన్ లో సీజన్ ప్రారంభానికి ముందే వైద్యశాఖతో అటు పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్ శాఖ అధికారులు కలిసి కూర్చోని వ్యాధులను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

సుకోవాలన్నారు. ప్రజల వైద్యం, ఆరోగ్య విషయంలో అదనపు కలెక్టర్లే బాధ్యత తీసుకోవాలని సూచించారు పట్టణాల్లో మహిళలకు ఇబ్బంది లేకుండా పబ్లిక్ టాయిలెట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. గిరిజనుల పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న రైతుల పట్ల అటవీ శాఖ అధికారులు అత్యుత్సాహం చూపిస్తున్నారని, ఇది సరైన చర్యకాదన్నారు.

ఇలాంటి చర్యకు మానుకొని ప్రభుత్వంకు మంచి పేరు వచ్చే విధంగా పని చేయాలని హితువు పలికారు. మండల పీహెచ్ స్థాయిల్లో సీజనల్ వ్యాధులను తగ్గించేందుకు శాఖల వారీగా సమన్వయం చేసుకొంటూ అధికారులు పక్కాగా పని చేయాలన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పల్లె ప్రగతిలో అందరు భాగస్వాములు కావాలి
పల్లె ప్రగతిలో అందరు భాగస్వాములు కావాలి
పల్లె ప్రగతిలో అందరు భాగస్వాములు కావాలి

ట్రెండింగ్‌

Advertisement