పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో పోలాండ్ స్టార్ ఇగా స్వియాటెక్ జోరు కొనసాగుతున్నది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో మూడో సీడ్ స్వియాటెక్ 6-2, 6-3తో సారా బెజ్లెక్పై అలవోక విజయం సాధించింది.
తద్వారా ఫ్రెంచ్ ఓపెన్‌లో తన విజయాల రికార్డును 42-3కు పెంచుకుంది.మిగతా మ్యాచ్ ల్లో స్వితోలినా 6-0, 6-4తో క్యువెడోపై, బెనిచ్ 6-4, 6-0తో మెక్నలీపై గెలిచి ముందంజ వేశారు. పురుషుల సింగిల్స్‌లో టాప్‌సీడ్ సినర్ 6-1, 6-3,6-4తో టాబర్పై, జొకోవిచ్ 6-3,6-2, 6-7,6-3తో రోమర్పై గెలిచారు.