మరాఠీ మందారం భాగ్యశ్రీబోర్సే భావోద్వేగానికి లోనైంది. జాతీయ నటుడు కమల్‌హాసన్ సొంత నిర్మాణ సంస్థలో నిర్మితమవుతున్న ‘సెయాన్’ చిత్రంలో ఆమె కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ముద్దుగుమ్మ కమల్‌హాసన్‌ని కలిసింది. ఈ సందర్భంగా ఆయనతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ‘డియర్ కమల్‌హాసన్ సార్.. చిన్నప్పట్నుంచీ మిమ్మల్ని తెరపై చూస్తూ పెరిగాను.
ఇప్పుడు ఈ చిన్న అమ్మాయి మీ సినిమాలోనే నటిస్తున్నది. నా తలపై చేయి ఉంచి, మీరు ఆశీర్వదించినప్పుడు నేను అనుభవించిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. మీరు గర్వపడేలా నటిస్తానని ప్రమాణం చేస్తున్నాను’ అంటూ రాసుకొచ్చింది భాగ్యశ్రీ బోర్సే. ఇక ‘సెయాన్’ సినిమా విషయానికొస్తే.. ఇది గ్రామీణ నేపథ్యంతో కూడిన కథ. మాస్ యాక్షన్, వినోదంతోపాటు కుటుంబ ప్రేక్షకుల్ని అలరించే భావోద్వేగాలు కూడా ఈ కథలో ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. ‘అమరన్’ విజయం తర్వాత కమల్‌హాసన్ నిర్మాణసంస్థలో శివకార్తికేయన్ నటిస్తున్న రెండో సినిమా ఇది. శివకుమార్ మురుగేశన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం అక్టోబర్‌లో విడుదల కానున్నది.