హైదరాబాద్ : బీజేపీ(BJP( గురువారం విడుదల చేసిన మూడో జాబితాను చూసి ఆ పార్టీ శ్రేణులే నిరుత్సాహానికి గురయ్యాయి. ముందుండి నడిపించాల్సిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan reddy) పేరే లేకపోవడంతో బరినుంచి కిషన్ రెడ్డి పరారీ అయ్యాడా అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. కాగా, అంబర్‌పేట నియోజకవర్గం నుంచి కృష్ణ యాదవ్ బరిలో ఉన్నారు.
తెలంగాణ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మూడో జాబితాను ప్రకటించింది. మొత్తం 35 మందితో మూడో లిస్ట్‌ను బీజేపీ హై కమాండ్ విడుదల చేసింది. ఈ జాబితాలో ఎస్సీ 5, ఎస్టీ 3 మందికి చోటు కల్పించారు. ఇక ఇప్పటికే రెండు జాబితాలల్లో మొత్తం 53 మందిని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక మూడో జాబితాలో అందోల్ నుంచి బాబుమోహన్, బాన్సువాడ నుంచి యెండల లక్ష్మీనారాయణ, ఉప్పల్ నుంచి ఎన్వీఎస్ ప్రభాకర్‌కు చోటు దక్కింది.