బడ్జెట్లో అన్యాయాన్ని సహించం.. బీసీ ఇంటలెక్చువల్ ఫోరం.. పొలిటికల్ ఫ్రంట్
బడ్జెట్లో బీసీలకు ప్రతిఏటా కాంగ్రెస్ సర్కార్ తీవ్ర అన్యాయానికి గురిచేస్తున్నదని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ తీవ్రంగా ఆక్షేపించాయి.
- బడ్జెట్లో 50వేల కోట్లు కేటాయించాలని 27న దీక్ష
హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): బడ్జెట్లో బీసీలకు ప్రతిఏటా కాంగ్రెస్ సర్కార్ తీవ్ర అన్యాయానికి గురిచేస్తున్నదని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ తీవ్రంగా ఆక్షేపించాయి. కేటాయించిన అత్తెసరు నిధులను సైతం ఖర్చు చేయడం లేదని మండిపడ్డాయి. ఈ మేరకు ఫోరం చైర్మన్ చిరంజీవులు, ఫ్రంట్ చైర్మన్ బాలరాజుగౌడ్ శనివారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. బడ్జెట్లో బీసీలకు జరిగే అన్యాయాన్ని ఇకపై సహించేదిలేదని తేల్చిచెప్పాయి.
అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సబ్‌ప్లాన్ కింద ఏటా రూ.20 వేల కోట్ల చొప్పున ఐదేండ్లలో లక్ష కోట్లను వెచ్చిస్తామని హామీ ఇచ్చిందని, గత రెండేండ్లలో కేవలం రూ.5వేల కోట్లే కేటాయించిందని ఆరోపించారు. కామారెడ్డి డిక్లరేషన్ హామీని అమలుచేయడంతోపాటు రాబోయే బడ్జెట్లో బీసీలకు రూ.50వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న ఇందిరాపార్క్ వద్ద నిరాహార దీక్ష చేపట్టనన్నట్టు వెల్లడించారు. దీక్షకు బీసీ మేధావులు, సంఘాల నేతలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

