హనుమకొండ చౌరస్తా, మార్చి 8 : నమస్తే తెలంగాణ-తెలంగాణటుడే ఆధ్వర్యంలో హనుమకొండలోని కుడా హయగ్రీవాచారి మైదానంలో నిర్వహించిన ఆటోషోకు విశేష స్పందన వచ్చింది. మారుతి సుజుకి, స్కొడా, టీవీఎస్, విన్, కియా , ఆదర్శ, నెక్సా, గ్రీన్ హోండా, హ్యాపీ, యమహా, ప్రైడ్ సిట్రోన్, రాం గ్రూప్, ఎంజీ యాజమాన్యాలు తమ లేటెస్ట్ కార్లు, బైక్‌లను ప్రదర్శనలో ఉంచారు.
రెండు రోజులపాటు జరిగే ఆటోషోను శనివారం ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు ప్రారంభించారు. వినియోగదారులు స్టాళ్లను సందర్శించి అక్కడికక్కడే బుక్ చేసుకున్నారు. ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి మాట్లాడుతూ వాహన ప్రేమికుల కోసం ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ ఆటోఎక్స్‌పో షో నిర్వహించడం అభినందనీయమన్నారు.
హనుమకొండ జడ్పీ మాజీ చైర్మన్ సుధీర్‌కుమార్ మాట్లాడుతూ బైకులు, కార్లు కొనాలనుకునేవారి కోసం ఒకే వేదికపైకి వివిధ కంపెనీలకు చెందిన వాహనాలు రావడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ‘నమస్తే తెలంగాణ’ వరంగల్ యూనిట్ బ్రాంచ్ మేనేజర్ అశోక్‌కుమార్, ఎడిషన్ ఇన్చార్జి కిరణ్‌కుమార్, బ్యూరో ఇన్చార్జి గోపాల్, మార్కెటింగ్ మేనేజర్ సూరయ్య, సర్క్యులేషన్ మేనేజర్ సురేశ్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు పులి రజినీకాంత్, మాజీ కార్పొరేటర్ రమేశ్, రఘు, కరీంనగర్, వరంగల్ డీసీసీబీ డైరెక్టర్లు రవీందర్‌గౌడ్, చెట్టుపెల్లి మురళీధర్‌రావు, మాజీ జడ్పీటీసీ సారంగపాణి, నల్లబెల్లి సింగిల్‌విండో చైర్మన్, బీఆర్ఎస్ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి, ఎల్కతుర్తి సింగిల్ విండో వైస్ చైర్మన్ మునిగడప శేషగిరి, ఎల్కతుర్తి మాజీ వైస్ ఎంపీపీ తంగెడ నగేశ్ పాల్గొన్నారు.