మేడ్చల్ కలెక్టరేట్, ఆగస్టు 29: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో అసిస్టెం ట్ రిజిస్ట్రార్ రూ.లక్ష లంచం తీసుకుం టూ పట్టుబడి అరెస్టు అయ్యాడు. జిల్లా కు చెందిన నవభారత్ కో-ఆపరేటివ్ బ్యాంకు అధికారులు, ఖాతాదారులకు ఇటీవల వివాదం చోటుచేసుకున్నది. ఖాతాదారులు తమ సమస్యను పరిష్కరించాలని జిల్లా కో ఆపరేటివ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ బీ శ్రీనివాసరాజును 24న ఆశ్రయించారు. సమస్యను పరిష్కరించేందుకు రూ.5 లక్షల లంచం ఇవ్వాలని అసిస్టెంట్ రిజిస్ట్రార్ డిమాం డ్ చేశాడు. రూ.లక్ష ఇస్తామని ఒప్పం దం చేసుకున్నారు. ఏసీబీ అధికారుల ను ఆశ్రయించిన ఖాతాదారులు గురువారం కలెక్టరేట్లోని ఆ అధికారిని కలవగా, తన కారులో ఆ లంచం సొమ్ము పెట్టాలని చెప్పాడు. ఖాతాదారులు ఆ డబ్బును కారులో పెట్టగానే, పథకం ప్రకారం ఏసీబీ అధికారులు వచ్చి అనంతరం అసిస్టెంట్ రిజిస్ట్రార్ శ్రీనివాసరాజును అదుపులోకి తీసుకొని, సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.