హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): అన్ని గురుకులాల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) ఉద్యోగాల దరఖాస్తుల నమోదు గడువు శనివారం సాయంత్రం 5 గంటలకు ముగియనున్నది. ఇప్పటికే 4,006 పోస్టులకు లక్షకుపైగా దరఖాస్తులు వచ్చినట్టు గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది.
గురుకులాల్లో అన్ని విభాగాల ఉద్యోగాల కంటే టీజీటీ పోస్టులే అత్యధికం కావడం గమనార్హం. గురుకులాల్లో 9,210 పోస్టుల భర్తీకి బోర్డు ఈ ఏడాది ఏప్రిల్ 17 నుంచి విడతల వారీగా నోటిఫికేషన్లు ఇచ్చిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 28 నుంచి టీజీటీ దరఖాస్తులను స్వీకరించింది.