Minister Errabelli | మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి ఎర్రబెల్లి
Minister Errabelli | తెలంగాణ మహిళలు దేశానికే ఆదర్శం. దేశంలో డ్వాక్రా సంఘాలను బలోపేతం చేస్తున్నది మన మహిళలే. రాష్ట్రంలో లాగా దేశంలో ఎక్కడా మహిళలు ఆర్థికంగా ఎదగలేదు. మిగతా రాష్ట్రాలలో పరిస్థితులు మరింత అధ్వానంగా ఉన్నాయని పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
పాలకుర్తి ఆగస్టు 24 : తెలంగాణ మహిళలు దేశానికే ఆదర్శం. దేశంలో డ్వాక్రా సంఘాలను బలోపేతం చేస్తున్నది మన మహిళలే. రాష్ట్రంలో లాగా దేశంలో ఎక్కడా మహిళలు ఆర్థికంగా ఎదగలేదు. మిగతా రాష్ట్రాలలో పరిస్థితులు మరింత అధ్వానంగా ఉన్నాయని పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు సంబంధించి 6 గ్రామైక్య సంఘాల మహా సభలు పాలకుర్తిలోని ఓ ఫంక్షన్ హాలులో జరిగాయి.
ఈ మహా సభలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పాపాల ఫలితంగానే ప్రజలు కష్టాల పడాల్సి వస్తుందన్నారు. బీజేపీ పాలనలో మరింత దిగజారిన పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకే సీఎం కేసీఆర్ ఎంతో కష్టపడి పని చేయాల్సి వస్తున్నదని పేర్కొన్నారు. మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.
మహిళలు ఆర్థికంగా ఎదిగితే, ఆ కుటుంబం, సమాజం, గ్రామం రాష్ట్రం, దేశం, ప్రపంచమే బాగు పడుతుందని తెలిపారు. అనంతరం మహిళా సంఘాలకు ఐదు కోట్ల రూపాయల విలువైన రుణాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్ పర్సన్ ఉషా దయాకర్ రావు, మహిళా సంఘాల పాలక వర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Upasana | దీపావళి వేడుకల్లో స్టార్ హీరోల భార్యల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఉపాసన, స్నేహారెడ్డి, నమ్రత.. ఫొటోలు వైరల్!
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దీపావళి విషాదం.. 2 ప్రమాదాల్లో 12 మంది మృతి.. రెండు కుటుంబాలు బుగ్గి
Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సూపర్ స్ట్రయికర్.. కొత్త కారు అందుకున్న వైభవ్ సూర్యవంశీ
Sharwanand | శర్వానంద్ ‘భోగి’ మళ్లీ వాయిదా పడనుందా .. ఇంకా క్లారిటీ ఇవ్వని మేకర్స్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

