హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో 76వ ఐపీఎస్ ట్రైనీల డైరెక్టర్స్ పరేడ్ శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎన్పీఏ డైరెక్టర్ అమిత్‌గార్గ్ అకాడమీలో అంకితభావంతో పనిచేసిన 35 మంది అధికారులు, ఎన్పీఏ సిబ్బందిని సన్మానించి, ప్రశంసాపత్రాలు అందజేశారు.
పరేడ్ కమాండర్ అచ్యుత్ అశోక్ (కేరళ క్యాడర్) నేతృత్వంలో 207 మంది ట్రైనీ ఐపీఎస్‌లు కవాతు చేశారు. వీరిలో 19 మంది ఫారిన్ ఆఫీసర్స్ ఉన్నారు. కేరళ కేడర్‌కు చెందిన అపర్ణ ఫిజికల్ ట్రైనింగ్‌లో బెస్ట్ లేడీ ప్రొబెషనర్‌గా, నేపాల్ నుంచి సనమ్మల్లా బెస్ట్ జెంటిల్మన్ ప్రొబెషనర్‌గా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన శివమ్అశుతోష్ మస్కట్రీ విభాగంలో, విశ్వజిత్ శౌర్యన్ బెస్ట్ డ్రిల్ ప్రొబెషనర్‌గా మెడల్స్ అందుకున్నారు.