BJPLP | బీజేపీలో తేలని ఎల్పీ పంచాయితీ.. లీడర్ లేకుండానే బడ్జెట్ సమావేశాలు
రాష్ట్రంలో 2024-25 బడ్జెట్ సమావేశాలు మొదలైనా బీజేపీలో ఎల్పీ పీఠం ఎవరిదో ఇంకా తేలలేదు. ఈ కారణంగానే గురువారం అసెంబ్లీలో జరిగిన బీఏసీ సమావేశానికి బీజేపీ హాజరు కాలేకపోయింది.
BJPLP | హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 2024-25 బడ్జెట్ సమావేశాలు మొదలైనా బీజేపీలో ఎల్పీ పీఠం ఎవరిదో ఇంకా తేలలేదు. ఈ కారణంగానే గురువారం అసెంబ్లీలో జరిగిన బీఏసీ సమావేశానికి బీజేపీ హాజరు కాలేకపోయింది. ఎల్పీ పీఠంపై సీనియర్ నేతల మధ్య సఖ్యత కుదరకపోవడంతో రాష్ట్ర నాయకత్వం తలపట్టుకుంటున్నట్టు సమాచారం. ఏదో ఒక నిర్ణయం తీసుకొని లోక్‌సభ ఎన్నికలకు ముందు కొత్త పంచాయితీ తలకెత్తుకోవడం ఎందుకనే ఉద్దేశంలో రాష్ట్ర నాయకత్వం ఉన్నట్టు తెలిసింది.
గురువారం బీజేపీ ఎల్పీ నేతను ఎన్నుకుంటారని భావించారు. ఎన్నుకోకపోవడంతో బీఏసీ సమావేశానికి బీజేపీ ప్రతినిధిగా మహేశ్వర్‌రెడ్డి వెళ్లాలని పార్టీ సూచించింది. నిబంధనల ప్రకారం బీఏసీలో పాల్గొనాలంటే పార్టీ అనుమతి పత్రాలు తీసుకెళ్లాల్సి ఉంటుంది. మహేశ్వర్‌రెడ్డి పార్టీ లేఖ తీసుకొని వెళ్లేసరికే బీఏసీ మొదలైపోయింది. మధ్యలో సమావేశంలోకి వెళ్లడం భావ్యం కాదనే ఉద్దేశంతో ఆయన వెనక్కు తిరిగి వచ్చేశారు. రాజాసింగ్‌ను ఒప్పించి ఎల్పీ పదవిని మహేశ్వర్‌రెడ్డికి ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్టు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanuma Reddy | రిలీజ్ ముందే బంపరాఫర్.. యష్‌తో డేవిడ్ రెడ్డి దర్శకుడు కొత్త సినిమా?
Supriya Sule | సుప్రియా సూలే అల్లుడికి చెందిన సంస్థకు.. 1,200 ఎకరాల భూమిని లీజుకిచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం
పురాతన ఆలయ గోపురం ధ్వంసం.. సుదర్శన చక్రం చోరీకి యత్నం?
‘గీత కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలి’
Ram Charan | రామ్ చరణ్ కీలక నిర్ణయం.. బాలీవుడ్ దర్శకుడికి నో చెప్పారా?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

