తెలుగు యూనివర్సిటీ, జనవరి 26 : దర్శనమ్ ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక ఆధ్వర్యంలో మహాసహస్రావధాని, ప్రణవపీఠం వ్యవస్థాపకుడు బ్రహ్మశ్రీ డాక్టర్ వద్దిపర్తి పద్మాకర్ 19వ శతావధాన కార్యక్రమం తెలంగాణ సారస్వత పరిషత్తు హాల్లో శుక్రవారం ప్రారంభమైంది.
మూడు రోజులపాటు కొనసాగనున్న శతావధానాన్ని ద్విసహస్రావధాని మాడుగుల నాగఫణిశర్మ, శాంతాబయోటెక్ అధినేత డాక్టర్ కే ఐ వరప్రసాదరెడ్డి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వద్దిపర్తి శతావధానం ఆకట్టుకున్నది. కార్యక్రమంలో పండితులు మారుమాముల దత్తాత్రేయశర్మ, వెంకటరమణ శర్మ, పాలపర్తి శ్యామాలానంద ప్రసాద్, మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి, బండికాడి అంజయ్య పాల్గొన్నారు.