హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. పాఠశాల విద్యాశాఖ గురువారం ఫలితాలు వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 31,736 మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా.. 27,857 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. వీరిలో 23,013 మంది ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 82.61% ఉత్తీర్ణత నమోదైంది. వీరిలో బాలురు(81.29%), బాలికలు (84.87%) ఉత్తీర్ణత నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, ములుగు జిల్లాలు 100% ఉత్తీర్ణత నమోదు చేయగా.. వికారాబాద్ 44.43శాతంతో చివరి స్థానంలో నిలిచింది. బాలురు 17,568మంది హాజరు కాగా, 11,281 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 10,289 మంది పరీక్ష రాయగా.. 8,732 మంది పాస్ అయ్యారు.
ఫలితాల కోసం వెబ్సైట్ సందర్శించాలని అధికారులు కోరారు. ఈ నెల 26 నుంచి వచ్చే నెల 5 వరకు పది అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన అభ్యర్థులు రీ కౌంటింగ్, రీ వెరిఫికెషన్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. దరఖాస్తులను వెబ్సైట్ ద్వారా సమర్పించాలని కోరారు. రీ కౌంటింగ్ ఫీజు రూ.500, రీ వెరిఫికేషన్ ఫీజు రూ.1,000 అని అధికారులు వెల్లడించారు. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేయదల్చుకునేవారు హాల్‌టికెట్ జిరాక్స్, కంప్యూటరైజ్డ్ మా ర్కుల మెమో జత చేయాలని కోరా రు. పోస్టు ద్వారా పంపే అప్లికేషన్లను స్వీకరించబోమని పేర్కొన్నారు.