MP Mallu Ravi | రుణమాఫీని ప్రజలు నమ్మలే.. అందుకే ఎక్కువ ఎంపీ సీట్లు గెలువలేకపోయాం: ఎంపీ మల్లు రవి
రెండు లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చెప్పినా ప్రజలు నమ్మకపోవడం వల్లే ఎక్కువ ఎంపీ సీట్లు గెలువలేకపోయామని నాగర్‌కర్నూల్ ఎంపీ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ) : రెండు లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చెప్పినా ప్రజలు నమ్మకపోవడం వల్లే ఎక్కువ ఎంపీ సీట్లు గెలువలేకపోయామని నాగర్‌కర్నూల్ ఎంపీ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి అభిప్రాయపడ్డారు. గాంధీభవన్‌లో శుక్రవారం ఎంపీలు బలరాం నాయక్, రఘురాంరెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పినా ప్రజలు నమ్మకపోవడం వల్ల తాము టార్గెట్‌గా పెట్టుకున్న 14 ఎంపీ సీట్లు గెలువలేకపోయామని వివరించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం రేవంత్‌రెడ్డి ఆగస్ట్ 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేసి చూపించబోతున్నారని చెప్పారు. ఇంత పెద్ద మొత్తంలో రైతు రుణాలను మాఫీ చేసిన ఘనత అప్పుడు యూపీఏ ప్రభుత్వంలో ప్రధాని మన్మోహన్ సింగ్‌కు దక్కితే, ఇప్పుడు రేవంత్‌రెడ్డికి దక్కిందని తెలిపారు. ఈ విషయాన్ని పార్లమెంట్లో ప్రస్తావించాలని రాహుల్‌గాంధీని కోరుతామని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ర్టానికి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు, మిగతా బీజేపీ ఎంపీలు తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు.
రేవంత్, భట్టి వెళ్తే అందరూ వెళ్లినట్టే..
రుణమాఫీ హామీని నిలబెట్టుకున్న సందర్భంగా వరంగల్‌లో నిర్వహించబోయే బహిరంగ సభకు రాహుల్‌గాంధీని ఆహ్వానించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ఢిల్లీ వెళ్లనున్నట్టు మల్లు రవి తెలిపారు. వారిద్దరూ వెళ్లి రాహుల్‌తో మాట్లాడితే మిగతా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వెళ్లినట్టేనని చె ప్పారు. త్వరలో రైతు భరోసాను అమలు చేసేందుకు భట్టి ఆధ్వర్యంలో సబ్ కమిటీ కసరత్తు చేస్తున్నదని వివరించారు. బీఆర్ఎస్ హయాంలో గిరిజనులకు ఏం చేశారో చర్చకు సిద్ధమా అని కేటీఆర్‌కు ఎంపీ బలరాంనాయక్ సవాల్ విసిరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్‌రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

