ఆదిలాబాద్, ఆగస్టు 7(నమస్తే తెలంగాణ) : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో తమ్మిడిహట్టి బరాజ్ పనులను త్వరలో ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం పిప్రిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. బడ్జెట్లో గిరిజన సంక్షేమానికి రూ.17 వేల కోట్లను కేటాయించినట్టు తెలిపారు. నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అనిల్‌జాదవ్, ప్రేమ్‌సాగర్‌రావు, వెడ్మ బొజ్జు, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌస్ ఆలం పాల్గొన్నారు.
పిప్రిలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వచ్చిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో పలు గ్రామాల రైతులు సమస్యలతో కూడిన బ్యానర్ ఏర్పాటు చేసి స్వాగతం పలికారు. ‘మా గోస తీర్చండి సారూ’ అంటూ ఇచ్చోడ నుంచి పిప్రి వెళ్లే మార్గంలో ఆడేగాం వద్ద బ్యానర్ ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారిపై కట్టిన ఈ బ్యానర్ సభకు వచ్చే వారు ఆసక్తిగా గమనించారు.