VC Sajjanar | హైదరాబాద్ : సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు యువత రకరకాల స్టంట్లకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఈ స్టంట్లతో ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. అయితే ఓ యువకుడు ప్రదర్శించిన అత్యుత్సాహంపై టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తీవ్రంగా స్పందించారు.
ఫేమస్ కోసం ఇలా ప్రాణాలతో చెలగాటం ఆడటం పిచ్చితనం అని సజ్జనార్ మండిపడ్డారు. సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కోసం విలువైన ప్రాణాలను పణంగా పెట్టాలా!? ఏదో ఘనకార్యం వెలగబెట్టినట్లు ఆ పట్టరాని సంతోషం ఎందుకు.. ఇలాంటివి మీకు సరదాగా అనిపించొచ్చు.. కానీ జరగరాని ప్రమాదం జరిగితే ఏమవుతుందో ఆలోచించండి అని సజ్జనార్ పేర్కొన్నారు.
అయితే ఓ యువకుడు రైలు పట్టాలపైకి చేరుకున్నాడు. ఇక ఎదురుగా వస్తున్న రైలును చూసి.. పట్టాలపై బొర్లాబొక్కల పడుకున్నాడు. రైలు తన పైనుంచి దూసుకెళ్లిన సమయంలో భారీ శబ్దాలు రావడంతో తన చెవులను మూసుకునే ప్రయత్నం చేశాడు. రైలు వెళ్లిన తర్వాత లేచి తానేదో విజయం సాధించినట్టు ఫీలయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ ఘటనపైనే వీసీ సజ్జనార్ తీవ్రంగా స్పందించారు.
ఫేమస్ కోసం ఇలా ప్రాణాలతో చెలగాటం ఆడటం పిచ్చితనం!
సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కోసం విలువైన ప్రాణాలను పణంగా పెట్టాలా!?
ఏదో ఘనకార్యం వెలగబెట్టినట్లు ఆ పట్టరాని సంతోషం ఎందుకు.. ఇలాంటివి మీకు సరదాగా అనిపించొచ్చు.. కానీ జరగరాని ప్రమాదం జరిగితే ఏమవుతుందో ఆలోచించండి. pic.twitter.com/GF8PDKdqAf
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) May 11, 2025