TGSRTC | హైదరాబాద్ : నిత్యం తిరుపతి వెళ్లే ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త వినిపించింది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే లహరి ఏసీ బస్సుల్లో ఆర్టీసీ ప్రత్యేక రాయితీ ప్రకటించింది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే ప్రయాణికులకు ఈ లహరి ఏసీ బస్సుల్లో ఒక్కో టికెట్‌పై 10 శాతం రాయితీని కల్పిస్తున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఈ అవకాశాన్ని ఆర్టీసీ ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇప్పుడే టీజీఎస్ ఆర్టీసీ వెబ్సైట్ లాగిన్ అయి మీ టికెట్లను బుక్ చేసుకోవచ్చని ఆర్టీసీ అధికారులు సూచించారు.
Divine comfort. Divine savings. ✨
Travel Hyderabad ↔ Tirupati with Flat 10% OFF on #TGSRTC Lahari A/C buses.@revanth_anumula @Ponnam_INC @TelanganaCMO @SajjanarVC#Telangana #Hyderabad #Tirupathi #TakingTelanganaForward pic.twitter.com/m2U5CLOV6K— TGSRTC (@TGSRTCHQ) September 4, 2025