హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు (TGSRTC) రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2.5 శాతం డీఏ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. దీంతో ఆర్టీసీపై ప్రతినెల రూ.3.6 కోట్లు అదనపు భారం పడనుందని చెప్పారు. డీఏల పెంపుతో 30 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు లబ్ది చేకూరుస్తున్నట్లు వెల్లడించారు.
కాగా, మహిళా దినోత్సవం సందర్భంగా ఇందిరా మహిళా శక్తి బస్సులను ప్రభుత్వం శనివారం ప్రారంభించనుంది. మండల మహిళా సమైక్య సంఘాల ద్వారా మొదటి దశలో 150 బస్సులు అద్దె ప్రాతిపదికన ఆర్టీసీలోకి తీసుకొచ్చారు. తరువాత దశలో 450 బస్సులు మొత్తం 600 బస్సులు మహిళా సంఘాల ద్వారా అద్దె ప్రాతిపదికనకు ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే.