హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ) : ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే ప్రయాణికులు సూపర్ లగ్జరీలో వెళ్తే టికెట్ చార్జీపై 20% తగ్గింపు ప్రకటించింది.
అదేవిధంగా హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే ప్రయాణికులకు లహరి ఏసీ బస్సుల్లో 10 శాతం టికెట్ రాయితీ ఉన్నట్టు తెలిపింది. అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని సూచించింది.