TGS RTC | హైదరాబాద్ : సరస్వతి పుష్కరాలకు భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ నుంచి కాళేశ్వరానికి ప్రత్యేక బస్సులను నడిపించాలని టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, కూకట్పల్లి, జీడిమెట్ల, మేడ్చల్‌తో పాటు తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ నెల 14 నుంచి 24వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. 40 మంది కలిసి పుష్కరాలకు వెళ్లాలని అనుకుంటే వారి కాలనీలకే ప్రత్యేక బస్సులను పంపేలా ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు. ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం http://tgsrtcbus.in వెబ్ సైట్‌ని సంప్రదించాలని అధికారులు సూచించారు. ప్రత్యేక బస్సుల కోసం 9676671533, 9959226154, 9959226160 నంబర్లను సంప్రదించొచ్చు.