TGRTC : కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తమ డిమాండ్ల సాధన కోసం
ఆర్టీసీ ఉద్యోగులు తలపెట్టిన సమ్మెలో విషాదం నెలకొంది. వరంగల్ (D) నర్సంపేటలో గురువారం మధ్యాహ్నం ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ చనిపోయారు. 80 శాతం కాలిన గాయాలతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆయన్ను మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం నుంచి హైదరాబాద్కు తరలిస్తుండగా కర్మాన్ఘాట్ దగ్గర కన్నుమూశారు.
ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు సమ్మె నోటీసులిచ్చినా పట్టని కాంగ్రెస్ సర్కార్ తీరుకు ఓ డ్రైవర్ బలయ్యాడు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపడం లేదనే ఆవేదనతో నర్సంపేటలో డ్రైవర్ శంకర్ గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించారు. తీవ్రంగా కాలిన గాయాలైన ఆయనను వరంగల్ ఎంజీఏం ఆస్పత్రికి తరలించారు. గాయాల తీవ్రతకు ఆయన పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ యశోదా ఆస్పత్రికి తీసుకొస్తుండగా మార్గమధ్యంలోనే శంకర్ గౌడ్ ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం కంచన్బాగ్ డీఆర్డీవో అపోలో ఆస్పత్రిలో ఆయన మృతదేహం ఉన్నట్లు తెలుస్తోంది.